చైతన్య నాకు రెండవ సంతానం. మొదటి బిడ్డకంటే తొమ్మిదేళ్లు ఆలస్యంగా పుట్టాడు. సమ్మర్ క్యాంప్‌లో డ్యాన్స్‌లో మంచి ప్రతిభ చూపడంతో.. అందులోనే శిక్షణ కొనసాగించాను. ప్రతీ కదలికను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్న చైతన్య భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్ అవుతాడని సోహెయిల్ మాస్టర్ విశ్వసించారు. అతని నమ్మకాన్ని చైతన్య నిలబెట్టాడు. డ్యాన్స్‌తో పాటు చదువును కూడా కొనసాగిస్తున్నాడు. మర్రిపాలెంలోని శివశివాని స్కూల్ యాజమాన్యం చైతన్య చదువుకు సహకరిస్తోంది. యూత్ ఒలింపిక్స్‌లో దేశం తరఫున పాల్గొనాలన్న లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.
– పెంటకోట రాజేష్, చైతన్య తండ్రి