విజయోస్తు | - | Sakshi
Sakshi News home page

విజయోస్తు

Mar 17 2025 9:41 AM | Updated on Mar 17 2025 10:31 AM

విజయో

విజయోస్తు

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
జిల్లాలో పరీక్ష కేంద్రాలు 134 ఏ కేటగిరీ కేంద్రాలు 48 బీ కేటగిరీ కేంద్రాలు 71 సీ కేటగిరీ కేంద్రాలు 9 సమస్యాత్మక కేంద్రాలు 6
చీఫ్‌ సూపరింటెండెంట్లు 134 డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు 134 రూట్‌ ఆఫీసర్లు 14 అసిస్టెంట్‌ రూట్‌ ఆఫీసర్లు 14

హాజరుకానున్న విద్యార్థులు

29,927

రెగ్యులర్‌ 28,523

ప్రైవేటు 1,404

బాలురు 15,094

బాలికలు 13,429

విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 448 పాఠశాలల నుంచి 28,523 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1,404 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లాలో 134 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 134 మంది సీఎస్‌లు, 134 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 14 మంది రూట్‌ ఆఫీసర్లు, మరో 14 మంది అసిస్టెంట్‌ రూట్‌ ఆఫీసర్లను పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం కేటాయించారు. ప్రతీ కేంద్రంలో సరిపడా ఇన్విజిలేషన్‌ సిబ్బందిని నియమించారు. అవసరమైన పక్షంలో వినియోగించుకునేలా అనకాపల్లి జిల్లా నుంచి 240 మంది ఉపాధ్యాయులను రిజర్వ్‌లో ఉంచారు. పరీక్షల్లో ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాలను తనిఖీ చేసేలా ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. గోపాలపట్నం బాలుర, బాలికల హైస్కూళ్లలో పరీక్షా కేంద్రాలను రాష్ట్ర పరిశీలకుడు డి.దేవానందరెడ్డి జిల్లా విద్యాశాఽధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, పాఠశాల హెచ్‌ఎం వేణుగోపాల్‌ పర్యటనలో పాల్గొన్నారు.

ఓపెన్‌ పరీక్షలకు 938 మంది విద్యార్థులు

సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌) ఆధ్వర్యంలోని పదో తరగతి పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 938 మంది పరీక్షలకు హాజరుకానుండగా, ఇందుకోసం 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రానికి వంద మీటర్లు పరిధిలో ఉన్న జెరాక్స్‌ కేంద్రాలను మూసివేసేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు. ఇన్విజిలేషన్‌ సిబ్బంది, ఛీప్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు కూడా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదు.

పరీక్షలు ఎప్పటివరకంటే :

సోమవారం నుంచి

ఏప్రిల్‌ 1వ తేదీ

పరీక్ష సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు

పరీక్ష కేంద్రాలకు

సంబంధించిన సూచనలు

విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదు.

సున్నితమైన పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది.

హాల్లోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్ప ఎవరూ మొబైల్‌ ఫోన్‌ తీసుకురావద్దు.

విద్యార్థులకు సూచనలు

హాల్‌ టికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలి.

సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్‌ డివైజులు, స్మార్ట్‌ వాచ్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.

హాల్‌టికెట్‌ చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో తాగునీరు, నిరంతర విద్యుత్‌, ఫ్యాన్లు ఉండేలా చర్యలు చేపట్టారు.

ప్రతీ కేంద్రంలో ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు.

విజయోస్తు1
1/1

విజయోస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement