ఏయూక్యాంపస్: తీరప్రాంత భద్రత ప్రాధాన్యతను వివరిస్తూ సీఐఎస్‌ఎఫ్ చేపట్టిన సైకిల్ థాన్‌ను మంగళవారం ఉదయం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకా కుళం నుంచి సైకిల్‌థాన్ బృందం సోమవారం విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. తిరిగి విశాఖ నుంచి మంగళవారం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. సైకిల్‌థాన్‌కు మద్దతుగా పలువురు చిన్నారులు సైకిళ్లపై సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంట కొంత దూరం ప్రయాణించారు. పీపీఏ సెక్రటరీ టి.వేణు గోపాల్ పాల్గొన్నారు.