2009 సెప్టెంబర్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మహానేత డాక్టర్ వైఎస్సార్ పేరును స్టేడియానికి పెట్టేందుకు అందరూ అంగీకరించారు. కౌన్సిల్ ఆమోదం పొందింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహానేత వైఎస్సార్ పేరు తొలగించాలని కంకణం కట్టుకున్నట్టుంది. కౌన్సిల్ దృష్టికి రాకుండా, సభ్యుల ఆమోదం తెలపకుండా పేరు ఎలా తొలగిస్తారు? ఈ విషయమై త్వరలో జరగబోవు కౌన్సిల్ సమావేశంలో చర్చకు పట్టుబడతాం.
– బానాల శ్రీనివాసరావు,
వైఎస్సార్ సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్