క్యాష్‌ కొట్టు.. స్టాఫ్‌ నర్స్‌ పోస్టు పట్టు | - | Sakshi
Sakshi News home page

క్యాష్‌ కొట్టు.. స్టాఫ్‌ నర్స్‌ పోస్టు పట్టు

Mar 21 2025 1:05 AM | Updated on Mar 21 2025 1:01 AM

● నర్సింగ్‌ పోస్టులకు కూటమి నాయకుల బేరాలు ● పోస్టుకు రూ.3 లక్షల నుంచిరూ.5 లక్షల వరకు వసూళ్లు ● రెండు రోజుల్లో మెరిట్‌ జాబితా.. 31లోగా తుది జాబితా

మహారాణిపేట: స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీలో పైరవీలు జోరందుకున్నాయి. ఈ పోస్టులను కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వంత పాడుతూ పైరవీలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుకూలురికి పోస్టులు కట్టబెట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్‌(ఆర్‌డీ) మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు సిఫార్సుల లేఖలు, మరో వైపు ప్రజాప్రతినిధులు, వారి పీఏలు ఫోన్లు మీద ఫోన్లతో ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.

బేరసారాలు : ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 106 స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏడాది కాలానికి కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 8,309 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 88 మంది చొప్పున పోటీ నెలకొనడంతో కూటమి నేతల పంట పండినట్లయింది. ఒక్కో పోస్టు కోసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ ఆధ్వర్యంలో ప్రొవిజినల్‌ జాబితా మీద వచ్చిన 1,530 అభ్యంతరాల వడపోత కార్యక్రమం జరుగుతోంది. రెండు రోజుల్లో మెరిట్‌ జాబితా వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31 లోపు రోస్టర్‌ ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అధికారులు కసరత్తు చేపట్టారు.

రంగంలోకి దళారులు : మరోవైపు దళారులు కూడా రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్ని మాయ మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతోపాటు, కార్యాలయ సిబ్బందితో బేరాలకు దిగుతున్నారు. కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వారి ద్వారా పోస్టులకు ధర నిర్ణయిస్తున్నారు. వీరు కూడా పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ అడ్వాన్స్‌ ముడుపులిచ్చేవారికే పోస్టింగ్‌ అంటూ నమ్మబలుకుతున్నారట.

దళారులను నమ్మొద్దు

పోస్టుల భర్తీ మెరిట్‌ ప్రకారమే జరుగుతుంది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. అర్హత ప్రమాణాలు, మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం ప్రాథమిక ఎంపిక జాబితా సిద్ధం చేస్తున్నాం. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాకే తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తాం.

– డాక్టర్‌ రాధారాణి, ఆర్‌డీ, వైద్య ఆరోగ్యశాఖ

క్యాష్‌ కొట్టు.. స్టాఫ్‌ నర్స్‌ పోస్టు పట్టు 1
1/1

క్యాష్‌ కొట్టు.. స్టాఫ్‌ నర్స్‌ పోస్టు పట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement