ప్రాణం తీసిన ఈత సరదా
పెందుర్తి: వారాంతంలో స్నేహితులతో సరదాగా గడుపుదామని పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి మేహాద్రి రిజర్వాయర్ కాలువలో అసువులు బాశాడు. స్నేహితులతో సరదాగా ఈతకు దిగిన డబ్బీరు సాయిక్రాంతి(28) అనే వ్యక్తిని మృత్యువు కబళించింది. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరాలివి. గోపాలపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన 9 మంది స్నేహితులు కోటనరవ సమీపంలోని ఎంఈఎస్ పంపు హౌస్ సమీపంలో ఉన్న మేహాద్రి రిజర్వాయర్ కాలువ వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అందరూ కలిసి స్నానాలకు కాలువలో దిగారు. అయితే డబ్బీరు సాయిక్రాంతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఆందోళనకు గురైన స్నేహితులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే గజ ఈతగాళ్లను రప్పించి సాయిక్రాంతి కోసం గాలించారు. మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఇఫ్తార్ సహర్ సోమ మంగళ 6.12 4.42