ఎంవీపీకాలనీ : విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లడానికి కార్మిక నాయకులే కారణమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకుల అనాలోచిత నిర్ణయాలు కారణంగానే ప్లాంట్‌కు నష్టం వాటిళ్లుతుందన్నారు. ఆయా కార్మిక సంఘాల నాయకుల ఆస్తులపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రూ.11,400 కోట్లు నిధులు కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించినా కార్మిక నాయకులు అక్కడ ధర్నాలు చేసున్నారంటూ ఎద్దేవా చేశారు. అసలు అక్కడ నిరసన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఎక్కడి నుంచి వచ్చారంటూ ప్రశ్నించారు. వారంతా రష్యా, చైనా బాగుండాలంటూ జెండాలు కట్టుకుని తిరిగే నాయకులంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీని పూర్తిగా ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో భాగంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాధవ్, పరశురామరాజు, ఆడారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఆయా నాయకుల ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరపాలి
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,
ఎమ్మెల్సీ సోము వీర్రాజు