విశాఖ లీగల్: ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 2,958 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వివిధ పదవులకు సంబంధించి ఆరు రంగుల బ్యాలెట్ పేపర్లను తయారు చేశారు. న్యాయవాదులందరూ బ్యాలెట్ పేపర్లను ఆ రంగు పెట్టెలో వేయాలని ఎన్నికల అధికారి, ప్రముఖ న్యాయవాది జీఎం రెడ్డి కోరారు. న్యాయవాదుల అనుభవాన్ని బట్టి ఆరు పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఒక్కో బూతులో ఒకేసారి ఐదుగురు అభ్యర్థులు ఓటు వేయడానికి అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన అభ్యర్థులు రాజకీయ పార్టీల పేరుతో ప్రచారం చేయడం కొసమెరుపు.