సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే..అది విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకించడమేనని విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతోందని..వాటిని వైస్సార్‌సీపీ అడ్డుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాయిపురెడ్డి అనిల్ ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేకే రాజు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి,పార్టీ ముఖ్యనాయకులు రవి రెడ్డి, మొల్లి అప్పారావు..వైఎస్సార్‌టీయూసీ భీశెట్టి భూపతి, గుంట సుందరం, సన్నీ, బుజ్జి, కోలా శివ, బాలకృష్ణ, నరసింహ మూర్తి, సూర్య పాల్ పాల్గొన్నారు.