
ఘనంగా జగదభిరాముని పట్టాభిషేకం
డాబాగార్డెన్స్: నగరంలోని అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరాముడి పట్టాభిషేకం సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేశారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. వేదపండితులు ఎం.భీమశంకరశాస్త్రి, సీహెచ్‌ఎల్‌ఎన్ అవధానులు, కె.పంచముఖి శర్మ, అంబికాబాగ్ దేవాలయ అర్చకుడు పి.వి.బాలసుబ్రహ్మణ్యచార్యులు ఆధ్వర్యంలో పట్టాభిషేక ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కార్యక్రమంలో ఈవో శోభారాణి, ఏఈవో తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.