
ఆక్వా వాటర్ వరల్డ్‌లో మునిగి బాలుడి మృతి
సీతమ్మధార: పోర్టు స్డేడియంలోిని విశ్వనాథ్ ఆక్వావరల్డ్ వాటర్ పార్కు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి బాలుడు మృతి చెందాడు. ఫోర్త్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మురళీనగర్‌కు చెందిన గంగాధర్, కల్పన దంపతులు కుమారుడు రుషి (8) రెండో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం తల్లి కల్పన, మేనత్త పిల్లలతో కలిసి విశ్వనాఽథ్ పోర్టు స్డేడియంలోని ఆక్వావరల్డ్ పార్కులోకి ఆడుకునేందుకు వెళ్లారు. పెద్దలకు లోపలకు ప్రవేశం లేకపోవడంతో బయట ఉన్నారు. స్విమ్మింగ్‌పూల్‌లో ఆడుకుంటూ రుషి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో రుషితోపాటు ఉన్న మేనత్త పిల్లలు కల్పనకు సమాచారమిచ్చారు. నిర్వాహకులు బాలుడ్ని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. ఫోర్తుటౌన్ సీఐ ఎ.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అలరించిన భారత్, యూఎస్ దళాల విన్యాసాలు