
112 కిలోల గంజాయి స్వాధీనం
కూర్మన్నపాలెం: అగనంపూడి టోల్‌గేటు వద్ద సోమవారం రాత్రి దువ్వాడ పోలీసుల తనిఖీల్లో 112 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. మాడుగుల ప్రాంతం నుంచి బెంగళూరుకు తరలించడానికి ఆటోలో గంజాయి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు అగనంపూడి టోల్‌గేటు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో కిముడు అనుమాన్, బురరిపాల్ దినకర్, ఒక బాలికను అరెస్ట్ చేశారు. ఆటో, బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మాడుగులలో అఖిల్ అనే వ్యక్తి వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేశారు. 100 ప్యాకెట్లుగా తయారు చేసి బెంగళూరుకు తరలించడానికి విశాఖ తీసుకొస్తున్నారు. ఒక వ్యక్తి బైక్‌పై పైలట్‌గా వస్తుండగా, వెనుక ఆటోలో గంజాయిని తీసుకువస్తున్న వారిని వల పన్ని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అఖిల్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.