
కాలుష్య కాసా(గ)రం
ఏయూక్యాంపస్: విశాఖ సాగరతీరం కాలుష్య కాసారంగా మారుతోంది. నగరంలోని మురుగునీరు నేరుగా సముద్రంలోకి చేరుతోంది. వర్షం కురిసిన ప్రతీ సారి పరిస్థితి మరింత దిగజారుతోంది. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు మురుగునీటితో కలిసి నేరుగా సముద్రంలోకి చేరుతున్నాయి. సాధారణంగా మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలి. కానీ పాండురంగాపురం, విక్టరీ ఎట్ సీ, సాగర్‌నగర్ వంటి ప్రాంతాల్లో మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోతోంది. దీంతో స్థానికులే కాదు.. పర్యాటకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని, మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
–ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్,
విశాఖపట్నం
సముద్రంలోకివెళ్తున్న మురుగునీరు