
రామచంద్రా.. నిబంధనలు వర్తించవా..
సింహాచలం: దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఉద్యోగం చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ రాష్ట్ర దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న కె.రామచంద్రమోహనే నిబంధనలు పాటించకపోవడం చర్చనీయాంశమైంది. గత నెల 26న సింహగిరికి వచ్చిన ఆయన సంప్రదాయ వస్త్రాలు ధరించకుండా స్వామిని దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. సంబంధిత వీడియా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. గతంలో రెండు దఫాలుగా ఏడేళ్లపాటు సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన ఆయన ఇలా చేయడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.