
పంట పొలంలోని ఆధార్ కార్డుల పరిశీలన
● పోస్టల్ సిబ్బందిపై అనుమానం ● కలెక్టర్‌కు నివేదిక: పెందుర్తి తహసీల్దార్
గోపాలపట్నం: నరవ వెళ్లే రహదారిలోని కంపరపాలెం పంట పొలంలో గుట్టలుగా ఉన్న ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను గురువారం పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. ‘పంట పొలంలో వందలాది ఆధార్ కార్డులు’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. స్థానిక వీఆర్వో, వీఆర్‌ఏలతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కవర్లు తెరవని ఆధార్, ఓటర్ కార్డులతో పాటు పలు బ్యాంకులకు చెందిన లెటర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక అందిస్తున్నట్లు తహసీల్దార్ ఆనంద్‌కుమార్ తెలిపారు. పెందుర్తి పోలీసులు కూడా ఇక్కడకు చేరుకుని, వివరాలు సేకరించారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆధార్, ఓటరు కార్డులు, బ్యాంక్ లెటర్లను రెవెన్యూ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. కాగా.. పోస్టల్ సిబ్బంది వీటిని పారవేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పంట పొలంలోని ఆధార్ కార్డుల పరిశీలన