
కుళ్లిన టమాటా ఉంటే ఇచ్చేయండి
జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి యాసిన్
విశాఖ విద్య: రైతు బజార్లకు చిత్తూరు నుంచి వచ్చే టమాటాల్లో పాడైనవి ఉంటే స్టాళ్ల నిర్వాహకులు వాటిని తిరిగి ఇచ్చేయాలని జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి షేక్ యాసిన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు టమాటాను ఎస్టేట్ అధికారుల దృష్టికి వెంటనే తీసుకొచ్చినట్లైతే రైతులు, స్టాళ్లను నిర్వహించే డ్వాక్రా వారికి ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ టమాటా అమ్మకాల్లో కిలోకు రూ.3 లాభం వచ్చేలా ధర నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 13 రైతు బజార్లలో రోజూ 30–40 టన్నుల టమాటా విక్రయాలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి 10 నుంచి 15 టన్నులు మాత్రమే వస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో అధిక టమాటా పండుతున్నందున, అక్కడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ, దాన్ని జిల్లాకు సరఫరా చేస్తోందన్నారు.