
న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షురాలిగా లక్ష్మీ సునంద
విశాఖ లీగల్ : జాతీయ మహిళా న్యాయవాదుల సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మీ సునంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సమాఖ్య సభ్యురాలు అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె నియామకం పట్ల సీనియర్ న్యాయవాదులు లక్ష్మీ రాంబాబు, మంజులత, అరుణ్ కుమారి, విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి ఎల్.పార్వతీనాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యులు బైపా అరుణ్ కుమార్, పి.నర్సింగరావు, కె.రామజోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మహిళా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని లక్ష్మీ సునంద తెలిపారు.