
పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం
ఎంవీపీకాలనీ: వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో వినియోగించే ఇంజినీరింగ్ ఉత్పత్తుల ప్రదర్శన శుక్రవారం ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా ప్రారంభమైంది. ఇండోర్ ఇన్ఫో లైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇండోర్ ఇన్ఫో లైన్ ఎండీ ఆర్‌కే అగర్వాల్‌తో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఏపీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌తో పాటు వీఏఎస్‌ఎస్‌ఐడబ్ల్యూఏ తదితర అసోసియేషన్లు ఈ ప్రదర్శనకు మద్దతుగా నిలిచినట్లు అగర్వాల్ తెలిపారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులను ఆయా సంస్థలు రాయితీపై విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నగర వినియోగదారులు ఈ ఉత్పత్తులను తిలకించవచ్చన్నారు. పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.