
ప్రకృతిక హైడ్రోజన్‌పై ముగిసిన అంతర్జాతీయ సదస్సు
విశాఖ విద్య: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) విశాఖపట్నం ఆధ్వర్యంలో ‘ప్రకృతిక హైడ్రోజన్ యొక్క సమర్థవంతమైన వినియోగం– ఒక స్థిరమైన శక్తి’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగం నిర్వహించింది. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు ప్రొఫెసర్ పి. కె. బానిక్, భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త డా. నిలోయ్ ఖారే సదస్సుకు చీఫ్ ప్యాట్రాన్లుగా వ్యవహరించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ ఇలాంటి కార్యక్రమాలతో కలిగే ఉపయోగాలను వివరించారు. ఐఐపీఈ డైరెక్టర్ శాలివాహన్ , కో–కన్వీనర్ ప్రొఫెసర్ రోషన్ కె. సింగ్, డా. ప్రభాకర్ ఠాకూర్ ప్రసంగించారు.