
డాక్టర్.. నా లక్ష్యం
ఇంటర్ బైపీసీలో 988 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. ఫస్టియర్‌లో 434 మార్కులు సాధించాను. ఎంబీబీఎస్ చదివి, తర్వాత పీజీ చేయడమే నా లక్ష్యం. మా నాన్న కాళ్ల అప్పలరాజు రేషన్ డీలర్. అమ్మ పద్మ గృహిణి. నేను చదువులో రాణించడానికి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నేను ఉన్నత స్థాయికి చేరుకుని వారికి మంచి గుర్తింపు తీసుకొస్తా. అధ్యాపకుల గైడెన్స్‌తో మంచి మార్కులు సాధించగలిగాను.
– కాళ్ల ఉమ, పాతవెంకోజీపాలెం