
కంప్యూటర్ ఇంజినీరునవుతా
తాళ్లవలసలోని తిరుమల కాలేజీలో ఇంటర్ చదివిన నేను 1000 మార్కులకు గాను 982 సాధించడం ఆనందంగా ఉంది. మొదటి ఫేజ్ జేఈఈ మెయిన్స్‌లో 96.57 పర్సంటైల్ సాధించాను. సెకండ్ ఫేజ్ పరీక్షలో 98 ప్లస్ పర్సంటైల్ వస్తుందనే నమ్మకం ఉంది. మా నాన్న ఇప్పిలి లక్ష్మీ త్రినాథ్ ప్రసాద్ ఓ ప్రయివేటు కంపెనీలో చిరు ఉద్యోగి. తల్లి దీప్తి గృహిణి. ప్రతి రోజూ 18 గంటల సాధన చేశాను. అడ్వాన్స్‌డ్‌లో మంచి పర్సంటైల్ సాధించి మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయాల్నదే నా లక్ష్యం. –ఇప్పిలి ధృతి, పట్టాభితోట