
సాక్షి విలేకరి వెంకటరమణకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు
విశాఖ సిటీ: విశాఖ సాక్షి విలేకరి చిటికిరెడ్డి వెంకటరమణకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు లభించింది. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని తమ్ములపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్టుల విభాగంలో సాక్షి విలేకరి సిహెచ్.వెంకటరమణ అవార్డు అందుకున్నారు. అలాగే విశాఖలో పలువురు జర్నలిస్టులకు ఈ పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. ఇందులో సామాజిక బాధ్యత భద్రతా విభాగంలో గంట్ల శ్రీనుబాబు, పి.బాలభాను, క్రైం జర్నలిజం విభాగంలో నందకుమార్, కిరణ్, బంగారు అశోక్‌కుమార్, ఫొటో, వీడియో విభాగంలో నీలాపు అశోక్, చిన్న పత్రిక, మీడియా ప్రోత్సాహం విభాగంలో పోలాకి రవికుమార్ అవార్డులు పొందారు. అలాగే సామాజిక స్పృహ, చైతన్యం విభాగంలో ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, కృష్ణపాత్రో, కేబుల్‌టీవీ న్యూస్ రీడర్ విభాగంలో కొణతాల మీన, తరుణ్‌జ్యోతి, సీనియర్ జర్నలిస్టుల విభాగంలో ఎండీ అబ్ధుల్లా, మహిళా జర్నలిస్టుల విభాగంలో పి.వీరలత, ఎం.లత అవార్డులు స్వీకరించారు.