
భారత కబడ్డీ జట్టుకు ఎండాడ మహిళ ఎంపిక
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడ ప్రాంతానికి చెందిన వివాహిత కొప్పాన గౌరి భారత కబడ్డీ జట్టుకు ఎంపికై ంది. వచ్చే జూన్‌లో బిహార్‌లో జరగనున్న రెండవ ప్రపంచ కప్ మహిళా కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె తాడేపల్లిగూడెంలోని పోస్టల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు కై వసం చేసుకుంది. భారత కబడ్డీ జట్టులో రాష్ట్రం తరఫున ఆమెకు స్థానం దక్కడం అభినందనీయమని అథ్లెటిక్ శిక్షకుడు వైకుంఠరావు అన్నారు. ఎండాడ గ్రామపెద్దలు, క్రీడాకారులు ఆమెను అభినందించారు.