
మార్చేశారు!
అడంగల్‌నూ
చక్రం తిప్పిన ‘సీతయ్య’
● సీసీఎల్‌ఏ స్థాయిలో కదిలిన పావులు ● చేతులు మారిన కోట్లు, రాత్రికి రాత్రి తెరపైకి కొత్త పేర్లు ● రక్షించుకునే అవకాశం ఉన్నా ప్రయత్నించని అధికారులు ● ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు ● రూ.200 కోట్ల భూమిలో అన్నీ వింతలే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఇది రూ.200 కోట్ల విలువైన భూమి కథ. అడ్డంగా రికార్డులన్నీ మార్చేసి... ఇన్ని రోజులుగా నిషేధిత జాబితాలో ఉండి... ప్రభుత్వ భూమిగా పేర్కొన్న విలువైన భూమిని కాస్తా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన కథ. రికార్డుల్లో ఉన్న వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి కట్టబెడుతూ పై నుంచి వచ్చిన ఆదేశాలతో నడిచిన వ్యవహారమిది. పక్కనే ఉన్న 14–4 సర్వే నెంబరులోని 5.10 ఎకరాల తరహాలోనే పట్టాదారుకు ఉన్న పట్టాను రద్దు చేసి హౌసింగ్ బోర్డుకు అప్పగించినట్టు చేసే అవకాశాలన్నీ జారవిడిచారు.. కాదు కాదు జారవిడిచేలా కూటమి నేతలు చక్రం తిప్పారు. రూ.200 కోట్ల భూమిని కాస్తా ప్రభుత్వ భూమి జాబితాలో నుంచి తీసివేసి.. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన కూటమి నేతలు ఆడిన కాసుల ఆటలో అంతిమంగా ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకులో 5.10 ఎకరాల భూమి తరిగిపోయింది. రూ.200 కోట్ల విలువ చేసే ఈ భూమిలో ఉన్నతాధికారులతో పాటు కూటమిలోని ‘సీతయ్య’ చక్రం తిప్పి అటు భూమి, ఇటు కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

మార్చేశారు!