రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు రిప్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ (75 రోజులు), సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్ (13 రోజులు), అలాగే సీ్త్రలకు లేడీస్ టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ ట్యాలీ అండ్ బేసిక్స్ (30 రోజులు), మగ్గం వర్క్స్ (30 రోజుల పాటు)లో శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డులతో పాల్గొనాలని సూచించారు. జెంట్స్ టైలరింగ్, లేడీస్ టైలరింగ్, మగ్గం వర్క్స్‌కు హాజరయ్యేవారికి 5వ తరగతి విద్యార్హత ఉంటే చాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment