గంజాయి అక్రమ రవాణా నిందితుడి అరెస్టు
రామభద్రపురం: 2019లో ఐషర్ వ్యాన్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పరారైన నిందితుడు డ్రైవర్ కిల్లో చిరంజీవి స్థానిక బైపాస్ రోడ్డులో పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. ఈ మేరకు సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో కాకర్లవలస జంక్షన్ వద్ద సాలూరు మీదుగా రామభద్రపురం వైపు వస్తున్న గంజాయితో ఉన్న వ్యాన్ 2019 జూన్ 17వ తేదీన స్థానిక పోలీసులకు పట్టుబడింది. అప్పట్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబూరుగు మండలం తామర వీధి గ్రామం నుంచి 266 కిలోల గంజాయిని ఐషర్ వ్యాన్‌తో అక్రమంగా తరలిస్తుండగా కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో ఎస్సై బి.లక్ష్మణరావు, సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యాన్‌ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్ కిల్లో చిరంజీవి పరారవడంతో క్లీనర్ వెల్లంగి రమేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేిశారు. ఇన్నాళ్ల తరువాత స్థానిక బైపాస్ రోడ్డులో అప్పటి నిందితుడు సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం పోలీసులు చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఆరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment