అనుమానంతోనే భార్య హత్య
దత్తిరాజేరు: ఈనెల 6న గుచ్చిమి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో భార్య యాకల గౌరమ్మను అనుమానంతోనే భర్త సత్యం హతమార్చాడని బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య తెలిపారు. నిందితుడు పెదమానాపురం బీసీ కాలనీ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్సై జయంతి, సీఐ రమణ పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య వివరాలు వెల్ల డించారు. స్వగ్రామం చుక్కపేట నుంచి పొలం పనులకు వెళ్తుండగా తోట వద్ద కొడవలితో హత్య చేసి అక్కడి నుంచి చెరువులో సెల్‌ఫోన్ పడేసి రక్తపు మరకలు కడుక్కుని మరడాం, మేడపల్లి, పోరాం, ఉద్దంగి వద్ద జాతీయ రహదారి దగ్గరలో నిందితుడు వేసుకున్న షర్ట్‌ను విప్పేసి తువ్వాలు కప్పుకుని బొండపల్లి మండలం గొల్లుపాలెంలో ఐదు రోజుల పాటు గొర్రెల కాపరులతో ఉన్నాడు. వారు డబ్బులు ఇవ్వక పోవడంతో పెందుర్తిలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పని చేయగా కూలి రూ.2వేలు రావడంతో ఆ డబ్బులతో బుధవారం సాయంత్రం పెదమానాపురం వచ్చాడు. భార్య మృతి చెందిందా? లేదా? పిల్లలు ఎలా ఉన్నారో? ఊరి పరిస్థితి తెలుసుకోవడానికి నిందితుడు పెదమానాపురం వచ్చిన సమాచారంతో పోలీసులకు పట్టుబడడంతో అరెస్ట్ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment