బొండపల్లి: ఈనెల 26న మండలంలోని కొత్తపాలెం గ్రామంలో శ్రీ కృష్ణమ్మ పేరంటాలు తల్లి మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలతో పాటు ఎడ్లబళ్ల ప్రదర్శన పోటీలు, గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మాజీ వైస్ ఎంపీపీ బొడ్డు రాము, గ్రామ సర్పంచ్ బొడ్డు సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల్లో విజేతలకు నగదు పారితోషకాలను అందజేయడంతో పాటు మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలు, పోటీదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment