క్యాంపస్ ఇంటర్వ్యూలు రేపు
బొబ్బిలి: పట్టణంలోని రాజా కాలేజ్‌లో దివిస్ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ లేదా ఎనలటికల్ కెమిస్ట్రీ, బీటెక్ కెమి కల్ ఇంజినీరింగ్, బి ఫార్మసీ కోర్సులు చేసిన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2000– 2005 సంవత్సరాల మధ్య విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, బయోడేటా, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని నేరుగా కళాశాలలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.
యువకుడిపై కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి దాడి చేసిన అబ్బాయిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కె. మురళీధర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురానికి చెందిన అమ్మాయి తన చుట్టాలబ్బాయితో కొమరాడ మండలంలోని గుంప వెళ్లి వస్తుండగా.. శివిని గ్రామం వద్ద నిందితుడు వాళ్ళిద్దర్నీ అడ్డుకొని తాను ప్రేమించిన అమ్మాయితో నీకేంటి పని అని గద్దిస్తూ చుట్టాలబ్బాయిని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా అమ్మాయి ఇంటికి వెళ్లి దుర్భాషలాలడుతూ అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. ఈ మేరకు అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి
● డీపీఓ వెంకటేశ్వరరావు
రాజాం సిటీ: గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి సారించాలని డీపీఓ వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని సోపేరు గ్రామంలో శనివారం ఆయన పర్యటించి, వర్మీకంపోస్టు తయారీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో క్లాప్‌మిత్రలు సేకరించిన తడి, పొడి చెత్తను కేంద్రంలో పూర్తిగా వేరు చేయాలని సూచించారు. తడిచెత్తను బయట ఏర్పాటు చేసిన ఫిట్స్‌లో వేయాలని, పొడి చెత్తను కేంద్రం లోపల డ్రై ఫిట్స్‌లో వేయాలన్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో సందప సృష్టిపై పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌సీ కో ఆర్డినేటర్ పట్నాయక్, ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు
రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఫైర్‌స్టేషన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీకి చెందిన ఆగూరు తిరుపతిరావు అనే వృద్ధుడు సైకిల్‌పై అమ్మవారి గుడి సమీపంలోని యోగాశ్రమానికి వెళ్తున్నా డు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన మో టార్‌సైక్లిస్ట్ ఢీ కొనడంతో వృద్ధుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి అత డ్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. క్షతగాత్రుడి అన్నయ్య ఆగూరు వెంకటరమణ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యా ప్తు చేస్తున్నామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు.
స్వగ్రామానికి ఎంటెక్ విద్యార్థి మృతదేహం
● మూడు రోజుల
కిందట సూరత్‌లో జరిగిన ప్రమాదంలో మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పూతికపేట గ్రామానికి చెందిన యువకుడు పత్తిగిడి నాగరాజు (25) గత నెల 27న గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. అక్కడి రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని సెల్‌ఫోన్ ఆధారంగా స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే వారు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో హైదరాబాద్‌లో ఉన్న మృతుడి అన్నయ్య చిరంజీవి సూరత్ వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామమైన పూతికపేట గ్రామానికి శనివారం తీసుకువచ్చారు. నాగరాజు ఐదు నెలల కిందటే సూరత్‌లోని ఎన్‌ఐటీలో ఎంటెక్ చేసేందుకు వెళ్లాడు. తమ కుమారుడు తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు.
క్యాంపస్ ఇంటర్వ్యూలు రేపు
Comments
Please login to add a commentAdd a comment