విజయనగరం క్రైమ్: పోలీస్ స్టేషన్‌లలో ఉన్న రిసెప్షన్ కౌంటర్లు ఇకపై ఉమెన్ హెల్ప్ డెస్క్‌లుగా మారుస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ఉమన్ హెల్ప్ డెస్క్లో ఒక మహిళా ఏఎస్సై, హెచ్‌సీ, మహిళా పీసీలను నియమిస్తామన్నారు. బాధితులు ఫిర్యాదు రాయలేకపోతే సిబ్బందే వారి ఫిర్యాదులను రాయాలని సూచించారు. ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆయా అంశాలను రిసెప్షన్ రిజిస్టర్‌లో నమోదు చేసి బాధితులకు రశీదు ఇవ్వాలన్నారు. అనంతరం విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్లో నియమించిన సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉండాలన్నారు. గొడవల కారణంగా బాధితులు ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే వారిని స్వధార హోమ్, వన్‌స్టాప్ సెంటర్‌లో ఆశ్రయం కల్పించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, వన్‌స్టాప్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన ఎస్‌హెచ్‌ఓలు, హెల్ప్డెస్క్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment