సచివాలయం వద్దే పింఛన్ల పంపిణీ
గజపతినగరం రూరల్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 1వ తేదీన ఇంటింటికీ వెళ్లి వలంటీర్లు పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధులు, రచ్చబండలు, సచివాలయాల్లోనే పింఛన్లు అందజేస్తున్నారు. మంచంపై ఉన్న వృద్ధులు సైతం అష్టకష్టాలు పడి పింఛన్ల పంపిణీ ప్రదేశానికి రావాల్సి వస్తోంది. గజపతినగరం మండలం కెంగువ గ్రామంలో శనివారం పలువురు లబ్ధిదారులకు సచివాలయంలోనే పింఛన్లు అందజేశారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ కల్యాణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలని, లబ్ధిదారులు అభీష్టం మేరకు ఒకేచోట ఇవ్వవచ్చన్నారు. సిగ్నల్ లేని ప్రాంతాల్లో సచివాలయంలో కూడా ఇవ్వవచ్చని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment