
విజయనగరం
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదర్శంగా చదువుకుందాం..రా..!
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో 2009వ సంవత్సరంలో ఏపీ మోడల్‌స్కూల్స్ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. –8లో
అమ్మవారిని దర్శించుకున్న
జెడ్పీ చైర్మన్
చీపురుపల్లి: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాల్లో భాగంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు రోజులు జాతరలో భాగంగా తొలి రోజు ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖ ర్, శ్రీదేవి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు
వ్యాయామ ఉపాధ్యాయుల
సంఘ ఎన్నిక
విజయనగరం: జిల్లా వ్యాయామ ఉపాధ్యాయు ల సంఘం అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎన్నికయ్యారు. పువ్వాడ స్కూల్లో ఆదివారం జరిగిన జిల్లా వ్యాయామ సంఘ ఎన్నికలలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. 251 మంది పీడీ, పీఈటీలు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర నాయకులు ఎంవి.రమణ, సాంబమూర్తి వ్యవహరించారు. కొత్త కార్యవర్గ సభ్యులకు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాయామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అభినందనలు తెలిపారు.
భక్తి భావంతో ప్రజలు మెలగాలి
● శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి
వంగర: ప్రజలు భక్తి భావంతో మెలగాలని విశాఖపట్నం శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. మండలంలోని గీతనాపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామాలయం పునఃప్రతిష్ఠ, ఆంజనే యస్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో ఆది వారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లె ప్రజ ల్లో ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రతిష్ఠ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్మాత్మిక చింతనతో మనశ్శాంతి ఉంటుంద ని, భగవంతుడి సేవలో ప్రజలు తరించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, సర్పంచ్ నెయిగాపుల శివరామకృష్ణయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నీతి మాలిన కూటమి పాలన
● మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
జియ్యమ్మవలస రూరల్: రాష్ట్రంలో కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి మాలి న పాలన సాగిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. చినమేరంగిలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆమె ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పాల న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. అబద్ధపు హామీలతో అడ్డదారిలో అధికారం చేపట్టి నేడు ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వెన క్కి తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అమ్మవారి దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు
పసుపు, కుంకుమ సమర్పించుకుంటున్న మహిళలు
చీపురుపల్లి:
కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవములు ఆదివా రం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆపదల నుంచి గట్టెక్కించు తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్దలతో వేడుకున్నారు. ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనా లు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలతో మొక్కు లు సమర్పించుకున్నారు. అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభంతో పాటు రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేసి దీపాలు వెలిగించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌తో పాటు ఒడిశా ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
వీఐపీ పేరుతో యథేచ్ఛగా దర్శనాలు
అమ్మవారి జాతరలో తొలి రోజు దర్శనాల విషయంలో భక్తులు నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.100, రూ.50, రూ.20, రూ.10 టిక్కెట్లును విక్రయించారు. వాటికి సంబంధించి అన్ని క్యూ లైన్లలో భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అయితే వీఐపీ దర్శనాల కోసం ఉంచిన గేటు నుంచి సామాన్యులు సైతం పదుల సంఖ్యలో వెళ్తుండడంతో దర్శనాలకు ఆటంకం కలిగిందని పలువురు భక్తులు దేవదాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికార కూటమి నాయకులు దగ్గరుండి సామాన్యులను వీఐపీ గేటు నుంచి నేరుగా గర్భగుడికి తీసుకెళ్లి దర్శనాలు చేయించుకున్నారని దీంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన తామంతా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పట్టించుకోని దేవదాయ, పోలీస్ శాఖలు
పక్క గేటు, వెనుక ద్వారం నుంచి దర్శనాలు నిలువరించి టిక్కెట్లు కొనుగోలు చేసుకుని దర్శనాలకు వెళ్లే భక్తులకు అవస్థలు లేకుండా చూడాల్సిన దేవదాయ, పోలీస్ శాఖలు కనీసం చర్యలు చేపట్టలేదనే విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. వీఐపీ గేటు తాళం టీడీపీ కార్యకర్తల చేతికి ఇచ్చి సాధారణ భక్తుల దర్శనాలకు జాప్యం జరిగే విధంగా దేవదాయ, పోలీస్ శాఖలు వ్యవహరించడం ఏమిటని క్యూలైన్లలో భక్తులు పోలీస్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. వీఐపీ గేటు నుంచి అధిక సంఖ్యలో సాధారణ భక్తులను పంపించడం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళ్తున్న తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కనీసం మిగిలిన రెండు రోజులైన ఇలాంటి చర్యలను నిలువరించాలని భక్తులు కోరుతున్నారు.
విద్యతోనే సమాజాభివృద్ధి
విజయనగరం గంటస్తంభం:
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీఆర్‌కే ఈశ్వరరావు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 10న నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్ష విజేతలకు జిల్లా పరిషత్ నందు ఆదివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడిని జయించి సత్ఫలితాలు సాధించాలన్నారు. ఉన్నతమైన విద్యను అభ్యసించడం ద్వారా మంచి సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. పదో తరగతి విద్యార్థుల్లో భయాన్ని పొగొట్టేందుకు ఎస్‌ఎఫ్‌ఐ చేసిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులంతా తమ చదువుల్లో రాణించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మంది విద్యార్థులతో నిర్వహించామన్నారు. జిల్లా స్థాయిలో జి.యశ్వంత్, ఎం.పల్లవి, ఎ.లాస్య వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్నకుమార్, న్యూ సెంట్రల్ స్కూల్ అధినేత రవితేజ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘ నేతలు ఎం.వెంకీ, రమేష్, జగదీష్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం:
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా నేడు సోమవారం ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలో చేపట్టనున్నారు. పోటీలో పది మంది అభ్యర్థులున్నప్పటికీ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు పోలింగ్ సరళి స్పష్టం చేసింది. మిగిలిన అభ్యర్థులు కూడా తమ అనుచరులతో ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు చీలిపోయినట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ వచ్చే పరిస్థితి లేదని ఉపాధ్యాయు లు చెబుతున్నారు. రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లుపైనే పోటీదారులు ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ విషయం
గత నెల ఫిబ్ర వరి 27న జరిగిన ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22,493 మంది ఓటర్లకుగాను 20,794 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.44 శాతం ఓటింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగడంతో ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓటు చీలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుచే గెలుపునకు కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ప్లస్ 1 ఓటు ఎవరికీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు.
కౌంటింగ్ ఇలా...
●ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 123 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్‌ల్లో ఉన్న ఓట్లు అన్నీ కలిపేస్తారు. దీంతో ఓట్లు లెక్కింపు సమయంలో ఏ మండలం నుంచి ఏ జిల్లా నుంచి పోటీదారులకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవ్వరికీ తెలియదు.
●ఓట్లు లెక్కింపునకు 20 టేబుల్స్ వేస్తారు. మొత్తం ఒకచోట వేసిన ఓట్లును 25 ఓట్లు చొప్పున కట్టలు కడతారు. ఇలా 25 ఓట్లు ఉన్న 40 కట్టలను(1000 ఓట్లు) ఆ ఇరవై టేబుల్స్‌కు పంచుతారు.
●మొత్తం పోలైన ఓట్లు 20,794 కావున ఇందులో 20 వేల ఓట్లును 25 ఓట్లు చొప్పున 800 కట్టలు కట్టి ఇరవై టేబుల్స్‌కు సర్దుతారు. మిగిలిన 794 ఓట్లు చివరి టేబుల్‌కు ఇస్తారు.
●ఈ 20 టేబుల్స్‌లో తొలుత చెల్లినవి, చెల్లని ఓట్లు వేరు చేస్తారు. మళ్లీ చెల్లిన ఓట్లును 25 చొప్పున కట్టలు కడతారు.
●పోటీ చేసిన అభ్యర్థులు 10 మంది కావడంతో పది ట్రేల్ ఏర్పాటు చేస్తారు.
●ఈ పది ట్రేల్స్‌లో 25 చొప్పున కట్టిన ఓట్లులో 1వ నంబర్ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును ఆ ట్రేల్స్ లో వేసి వారికి వచ్చిన మొత్తం ఓట్లును లెక్కిస్తారు.
గెలుపు ఇలా ..
●మొత్తం చెల్లిన ఓట్లులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం ప్లస్ 1 ఓటు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
●ఒకే వేళ ఈ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మొత్తం పది మందిలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన చివరి అభ్యర్థి ఓట్లలో 2వ నంబర్ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును మిగిలిన తొమ్మిదిలో ఎంత మందికి వస్తే వారందరికీ సర్దుతారు. చివరి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తారు.
●అయినా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇప్పుడు ఉన్న 9 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన ఓట్లులో 3వ నంబర్ ఓటు ఎంత మందికి వస్తే ఆ ఓటును మిగిలిన వారికి సర్దుతారు. తర్వాత చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ●ఇలా మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు చివరిగా ఉన్న అభ్యర్థుల ఓట్లను మిగిలిన వారికి సర్దుతూ, ఆ అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ 50 శాతం ప్లస్ 1 ఓటు ఎవరికి వస్తే వారిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తా రు. అక్కడితో ఎన్నిక తంతు ముగుస్తుంది.
న్యూస్‌రీల్
Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢ Ñgôæ™èl˘
లేకుంటే 2, 3 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు
మొత్తం ఓట్లు 22,493
పోలైన ఓట్లు 20,794
పోలింగ్ శాతం 92.44 శాతం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment