
ముగిసిన జాతీయ గిరిజన చిత్రకారుల సదస్సు
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, మాన్సాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిచిత్తర నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్ పేరిట స్థానిక కోటలోని రౌండ్ మహల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం ఆదివారం ముగిసింది. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ ఈ సమ్మేళనంలో 26 రకాల గిరిజన చిత్రకారులు 12 రాష్ట్రాల నుంచి పాల్గొనడం అభినందనీయమన్నారు. సుమారు ఐదు వందల మంది సందర్శకులు చిత్రాలను తిలకించారని పేర్కొన్నారు. సదస్సు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిత్రకారులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ సమ్మేళనం గోండ్, వార్లీ, పిథోర, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయా, కురుంబా, తంగ్‌ఖుల్ – నాగా, నాయకపోడు, సవర, సౌరా, మురియా, భిల్ వంటి విభిన్న కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజన చిత్రకారులను ఐక్యం చేసిందన్నారు. ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ విజయనగరం ప్రజలకు గిరిజన చిత్రాల పట్ల అవగాహన పెంపొందించుకునే అవకాశం వచ్చిందన్నారు. అనంతరం విద్యార్థుల సాంప్రదాయ కళా నృత్యా లు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో మహారాజా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎస్‌ఎన్ రాజు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.ప్రమాచటర్జీ, డా.అప్పసాబ, డా.వెంకటేశ్వర్లు డా.నగేష్, డా.దేబంజన నాగ్, డా.దివ్య, డా.ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ, డా.కుసుమ్, ఇరు సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.

ముగిసిన జాతీయ గిరిజన చిత్రకారుల సదస్సు
Comments
Please login to add a commentAdd a comment