
ఆదర్శంగా చదువుకుందాం..రా..!
మెరకముడిదాం మండలం గర్భాం ఆదర్శపాఠశాల
మెరకముడిదాం/లక్కవరపుకోట: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను చేరువచేయాలనే సంకల్పంతో 2009వ సంవత్సరంలో ఏపీ మోడల్‌స్కూల్స్ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. ఆయన సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ మోడల్ స్కూల్స్ నేడు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఏపీ మోడల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ భోధన, అలాగే 9 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయసంవత్సరం వరకూ ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు పాఠశాలల్లోనే వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న 16 ఆదర్శ పాఠశాలల్లో 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24 నుంచి మార్చి 31 వరకూ అర్హులైనవారు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి అర్హుడని తేలితే క్రెడిట్, డెబిట్, నెట్‌బ్యాంకింగ్ కార్డులు ఉపయోగించి గేట్‌వే ద్వారా రుసుం చెల్లించిన తరువాత జనరల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారం గా వెబ్‌సైట్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్, ఏపీఎంఎస్.ఏపీజీవోవీ.ఇన అడ్రస్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కులాల వారీగా పరీక్ష రుసుం
ఓసీ, బీసీ వారికి రూ.150, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 చెల్లించాలి. ప్రవేశపరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు కనీసం 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 30 రావాలి. ప్రతిభ, మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏప్రిల్ 20 వతేదీన పాఠశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఈ పాఠశాలల్లో చేరేందుకు అర్హులు.
మోడల్‌స్కూల్స్‌లో ప్రవేశాలకు ఆహ్వానం
ఉమ్మడి జిల్లాలో 16 పాఠశాల్లో దరఖాస్తుల స్వీకరణ
1600 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం

ఆదర్శంగా చదువుకుందాం..రా..!
Comments
Please login to add a commentAdd a comment