
ఇంటర్ ఫస్ట్‌ఇయర్ పరీక్షకు 562 మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 562మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె పట్టణంలోని పలు పరీక్షాకేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9437 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 8875మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌కాపీయింగ్ జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సిటింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, బల్క్‌మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారన్నారు. పరీక్షలన్నీ నిత్యం సీసీ కెమెరాల లైవ్‌స్ట్రీమింగ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి మా్‌స్‌కాపీయింగ్ నమోదు కాలేదని స్పష్టం చేశారు.
డీవీఈఓ మంజుల వీణ
Comments
Please login to add a commentAdd a comment