గాదె గెలుపుతో సంబరాలు | - | Sakshi
Sakshi News home page

గాదె గెలుపుతో సంబరాలు

Published Wed, Mar 5 2025 12:43 AM | Last Updated on Wed, Mar 5 2025 12:42 AM

గాదె

గాదె గెలుపుతో సంబరాలు

మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపుతో పీఆర్టీయూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ ఆధ్యక్షుడు ఆల్తిరాంబాబు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంగళవారం కేక్‌ కట్‌ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి గాదె శ్రీనివాసులునాయుడు అనుభవం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్‌.సింహాద్రి, ఆల్తి శ్రీహరి, టి.వి.వి.ఎల్‌.నరసింహం, సత్తారు రమణ, తదితరులు పాల్గొన్నారు.

మేధావుల తీర్పు...

కూటమికి ఓ గుణపాఠం

● గెలిచిన అభ్యర్థులు మా పార్టీ వారేనని చెప్పుకోవడం సిగ్గుచేటు ●

● కూటమి నాయకుల తీరుచూసి

నవ్యుకుంటున్న మేధావివర్గం

మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

సాలూరు రూరల్‌: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పు కూటమి ప్రజావ్యతిరేక పాలనకు చెంపపెట్టు అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘవర్మను గెలిపించాలంటూ ఊరూరా తిరుగుతూ, గురువులపై ఒత్తిడి తెచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మేధావుల తీర్పును సామాన్యులు సైతం స్వాగతిస్తున్నారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రివి అర్థంలేని మాటలుగా పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమవాడే అంటూ ప్రకటించడాన్ని చూసి మేధావివర్గం నవ్యుకుంటోందన్నారు. 9 నెలల పాలనలో ఉపాధ్యాయుల పీఆర్‌సీ, ఈఆర్‌, పెండింగ్‌ బిల్లుల వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కనీసం చొరవ చూపకపోవడంతో తగ్గిన బుద్ధిచెప్పారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజాసేవలో ఉత్సాహంగా ఉండాలని, కూటమి పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల తీర్పు తేటతెల్లం చేసిందన్నారు.

ప్రభుత్వ తీరుపై నిరసన

కొమరాడ: జంఝావతి రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులకు బడ్జెట్‌లో కనీస స్థాయిలో నిధు లు కేటాయించకపోవడంపై ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దీనికి నిరసనగా జంఝావతి రబ్బర్‌డ్యాం వద్ద మంగళవారం ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. ముందుగా నదికి పుష్పాభిషేకం చేశారు. జంఝావతికి నిధులు తేవడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. ఒడిశాతో ఉన్న సమస్యను పరిష్కరించలేకపోవడం విచారకరమన్నారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిర్మితమై తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. వలసలు తగ్గముఖం పడతాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గాదె గెలుపుతో సంబరాలు 1
1/2

గాదె గెలుపుతో సంబరాలు

గాదె గెలుపుతో సంబరాలు 2
2/2

గాదె గెలుపుతో సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement