
వీడని జ్వరాలు
శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర గ్రామాల చిన్నారులను జ్వరాలు వీడడం లేదు. మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గి మళ్లీ సోకుతున్నాయంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచం పట్టిన చిన్నారులను చూసి తల్లడిల్లుతున్నారు. కొద్దిరోజుల కిందట ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో వంటిపై పొక్కులు, తీవ్రమైన జ్వరంతో చిన్నారులు మంచం పట్టిన విషయం తెలిసిందే. ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు రాయపాలెం, పల్లపుదుంగాడ పొర్లు, మున్నపురాయి గ్రామాల చిన్నారులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. రాయిపాలెంలో ముగ్గురు చిన్నారులు మలేరియాతోను, పల్లపుదుంగాడలో ఒక చిన్నారి వంటిపై పొక్కులతో బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా జ్వరాలు తగ్గడంలేదంటూ తల్లిదండ్రులు మందుల సీసాలను చూపించి ఆవేదన చెందుతున్నారు.
గిరిజనుల్లో ఆందోళన..
చిన్నారుల ఒంటిపై పొక్కులు రావడం, జ్వరాలు సోకడం, మరికొందరు తరచూ జ్వరాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. వైద్యులు వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తున్నా జ్వరాల వ్యాప్తి కట్టడికాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. జ్వరాలకు కారణం నీరు, గాలి, పర్యావరణ కాలుష్యాలు ఏమైనా కావచ్చని వైద్యులు చెబుతున్నా... స్పష్టమైన కారణం నేటికీ నిర్ధారణ కాలేదు. ఇప్పటికై నా మూలాలు కనుక్కుని వైద్య సేవలు అందించాలని, జ్వరాలను కట్టడిచేయాలని గిరిజన యువకులు కోరుతున్నారు.
అస్వస్థతకు గురవుతున్న చిన్నారులు
కారణాలపై స్పష్టత కరువు
ఆవేదనలో గిరిజన ప్రజలు
కంటితుడుపు వైద్యమే...
జ్వరాలు, వంటిపై పొక్కులతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వైద్య బృందాలు వచ్చివెళ్లినా జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. జ్వరాల నివారణకు వైద్యులు చర్యలు తీసుకోవాలి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలి.
– జె.గౌరీష్, ఏపీ గిరిజన సంఘం నేత

వీడని జ్వరాలు
Comments
Please login to add a commentAdd a comment