
ఆరోగ్యమే మహాభాగ్యం
విజయనగరం అర్బన్: ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థినులు విద్యాబుద్ధులతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి సూచించారు. యూనివర్సిటీ ‘మహిళా సాధికారత మరియు ఫిర్యాదుల విభాగం’ ఆధ్వర్యంలో వర్సిటీలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించగలమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవిమాధవి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనానికి మంచి ఆహారపు అలవాట్లు దోహదపడతాయని తెలిపారు. అనంతరం మహిళా ఆరోగ్యం అంశంగా నినాదాలుచేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, బి.నళిని, వివిధ విభాగాల మహిళా అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జి వీసీ
ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి
ఘనంగా అంతర్జాతీయ మహిళా
దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment