
నేటి నుంచి జామి ఎల్లారమ్మ జాతర
శృంగవరపుకోట: భక్తుల కొంగుబంగారం జామి ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి మూడురోజుల పాటు జరగనున్న జాతరకు జిల్లా యంత్రాంగం, దేవదాయశాఖ, ఆలయ కమి టీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏటా మహాశివరాత్రి తర్వాత 9వ రోజున వచ్చే అష్టమినాడు ఎల్లారమ్మ పండుగ నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారి ఘటాలను గద్దె ఇంటి నుంచి ముహూర్తానికి ప్రధాన ఆలయానికి తీసుకెళ్తారు. గురువారం అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, శుక్రవారం పెద్ద తీర్థం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో క్యూలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహిస్తామని ఎస్‌ఐ వీరజానార్దన్ తెలిపారు. భక్తుల రాకపోకలకు అనువుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు.
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

నేటి నుంచి జామి ఎల్లారమ్మ జాతర
Comments
Please login to add a commentAdd a comment