
ముందస్తు అరెస్టులు
బొబ్బిలి: ఆశ వర్కర్ల ఆవేదన గళం వినిపించకుండా నొక్కేసే చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6న విజయవాడలో నిర్వహించే ధర్నాకు ఎవరూ తరలివెళ్లకుండా ముందస్తు అరెస్టులకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో సీపీఎం నాయకులు ఎ.సురేష్, బలస శ్రీనివాసరావును పోలీసులు అరెస్టుచేసి బొబ్బిలి స్టేషన్‌కు తరలించారు. ఇది సరైన విధానం కాదని, ఉద్యమాలను అణచలేరని, పరిష్కారం ఒక్కటే మార్గమని నాయకులు ఉద్ఘాటించారు.
పోలీస్ స్టేషన్‌లో సీపీఎం నాయకులు శ్రీనివాసరావు, సురేష్
Comments
Please login to add a commentAdd a comment