
ముగిసిన కనకమహాలక్ష్మి జాతర
చీపురుపల్లి: భక్తుల కొంగుబంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగిన జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు తిలికించేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు.
అమ్మవారి హుండీల ఆదాయం రూ.24,66,278
కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మూడు రోజుల జాతరలో రూ.24,66,278ల ఆదాయం లభించినట్లు దేవదాయశాఖ ఈఓ బి.శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.10,19,156లు, హుండీల నుంచి రూ.14,47,302లు, ఒక గ్రాము బంగారం, 80 గ్రాముల వెండి లభించిందన్నారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ జి.శ్యామ్‌ప్రసాద్ పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కింపు సాగింది.
Comments
Please login to add a commentAdd a comment