
అంగన్‌వాడీ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఐసీడీఎస్ సిబ్బందితో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండి, టాయిలెట్, విద్యుత్ సరఫరా లేని భవనాల కచ్చితమైన జాబితాను వెంటనే అందించాలని కోరారు. ప్రతి నెలా పిల్లల బరువును నమోదు చేసేటప్పడు కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని సూపర్‌వైజర్ తనిఖీ చేసి కార్యకర్త, ఆయా, ఆశ, ఏఎన్‌ఎంలను దగ్గర పెట్టుకుని పిల్లల బరువు, ఎత్తు నమెదు చేయాలని చెప్పారు. న్నారు. అందరి రిజిస్టర్లు ఒకేవిధంగా ఉండాలని ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ప్రసన్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment