ఓపెన్ హౌస్‌తో పోలీస్ వ్యవస్థ్ధపై అవగాహన
● ఎస్పీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: మహిళ సాధికార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని చాకలి బెలగాంలో ఉన్న పోలీస్‌శాఖ మల్టీఫంక్షన్ హాల్ ఆవరణంలో గురువారం ఓపెన్ హౌస్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్‌శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఽభద్రతే ప్రాధాన్యంగా పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందని మార్చి 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మహిళ సాధికార వారోత్సవాలను పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలను, పోలీస్‌శాఖలో కీలకమైన సాంకేతిక వ్యవస్థను, నేరస్థలంలో సాక్ష్యాలను సేకరించేందుకు క్లూస్‌టీమ్ ఉపయోగించే పరికరాలు, డాగ్‌స్క్వాడ్ పనితీరును కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కళాశాల విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్‌సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా కొన్ని ఆయుధాలు వినియోగించే పద్ధతులను మహిళలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన జాగిలాల విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, టౌన్ సీఐ మురళీధర్, రూరల్ ఎస్సై సంతోషి, శాఖాపరమైన సిబ్బంది పాల్గొన్నారు.
ఓపెన్ హౌస్‌తో పోలీస్ వ్యవస్థ్ధపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment