దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయం
● దేవదాయశాఖ జిల్లా సహాయ కార్య
నిర్వహణాధికారి శిరీష
విజయనగరం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయమని ఆ శాఖ జిల్లా సహాయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయంలో ఆమె గురువారం మాట్లాడారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 9,900 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగువేల ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నట్టు వెల్లడించారు. శిస్తుల రూపంలో 2వేల ఎకరాల భూములకు రూ.50 లక్షలు, ఆస్తుల లీజుల వల్ల రూ.57 లక్షల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. జిల్లాలో 473 ఆలయాల రిజిస్టరై ఉన్నాయని, భూములున్న దేవాలయాలు 313కాగా, 165 ఆలయాలు మాత్రమే కార్యనిర్వహణాధికారుల చేతుల్లో ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, కొత్తవలస, వీరభద్రపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి శిస్తులు చెల్లించాలని రైతులకు కట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment