జ్వరాలకు కారణాలు విశ్లేషించాలి
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయన్న వార్తపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి గురువారం చేరుకుని జ్వరాలతో చికిత్స పొందుతున్న గిరిజన చిన్నారులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలపై ఆరా తీశారు. జ్వరాలకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలను వేగవంతంగా చేపట్టాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట ఎస్టీ కమిషన్ మెంబర్ కొర్రా రామలక్ష్మి ఉన్నారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ
శంకరరావు
Comments
Please login to add a commentAdd a comment