
10న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ, జేకేసీ కో ఆర్డినేటర్ రాంబాబులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరిస్ లిమిటెడ్ హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ సమీపంలో ఉన్న బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ట్రైనీ సూపర్‌వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మశీ, బీటెక్(కెమికల్). ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రి),అనలిటికల్ కెమిస్ట్రీ, ఎం ఫార్మశీ చేసిన వారు అర్హులని తెలిపారు.పై కోర్సులు పూర్తిచేసిన లేదా ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్‌లను తీసుకుని ఇంటర్వూకు హాజరు కావాలని సూచించారు.
డీఎస్సీ, ఎస్జీటీకి ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ
విజయనగరం టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆఽంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు డీఎస్సీ, ఎస్జీటీ పరీక్షకు అర్హులైన జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.పెంటోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు డిగ్రీ మార్క్‌లిస్ట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నేటివిటీ, డీఎస్సీకి ఎంపికై న టెట్ మార్క్స్, జిరాక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9603557333, 9177726454 నంబర్లను సంప్రదించాలని కోరారు.
సేవా పతకాలు అందజేసిన కమాండెంట్ మల్లికా గార్గ్
డెంకాడ: ఉత్కృష్ఠ, అతి ఉత్కృష్ఠ సేవా పతకాలను ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్ పోలీస్‌అధికారులు, సిబ్బందికి కమాండెంట్ మల్లికా గార్గ్ అందజేశారు. చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 2019లో 12, 2020లో 9, 2023లో 13 ఉత్కృష్ఠ సేవా పతకాలకు ఎంపికై న బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బందికి కమాండెంట్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 2019వ సంవత్సరంలో 7, 2020లో 4, 2023లో 7 అతి ఉత్కృష్ఠ పతకాలను అందజేశారు. పదిమందికి యాంత్రిక్ సేవా పతకాలను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ డి.వెంకటేశ్వరరావు,అసిస్టెంట్ కమాండెంట్‌లు పి.సత్తిబాబు,ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి,, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment