
అన్నిరంగాల్లోనూ మహిళలు రాణించాలి
నేటి మహిళలందరూ ప్రతి రంగంలోనూ రాణించాలి. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. భవిష్యత్తుకు మార్గం వేయాలి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విషయంలో మహిళలు నైపుణ్యం ఎలా ప్రదర్శిస్తారో..ఉద్యోగ విషయంలోనూ ఎటువంటి పరిస్ధితినైనా సమర్ధవంతంగా ఎదుర్కొని దానికి చక్కటి పరిష్కారం చూపించ గలుగుతారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయగలుగుతారు. మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
– కె.శిరీష, జిల్లా దేవాదాయశాఖ అధికారిణి, విజయనగరం
ఆత్మవిశ్వాసమే ఆభరణం
మహిళకు ఆత్మవిశ్వాసమే అసలైన ఆభరణం. మొక్కవోని కార్యదీక్ష, ఓర్పు, నేర్పు, శక్తియుక్తి వంటి లక్షణాలే తరగని ఆభరణాలు. మగవారికి మకుటమై మణిమాణిక్యమై మనుగడకే మణిదీపమై వెలుగులీనే వేగుచుక్క నేటి మహిళ. విధివంచితలైనా, విజయభేరి మోగించే నేటిమహిళ పురషుల కన్నా మహాశక్తి కలది.సమాజంలోని ఆటుపోట్లను ఎదుర్కొని ముందడుగు వేసే ప్రతిమహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
– కోరుపోలు కళావతి, ప్రముఖ రచయిత్రి, విజయనగరం

అన్నిరంగాల్లోనూ మహిళలు రాణించాలి

అన్నిరంగాల్లోనూ మహిళలు రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment