3.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ చక్కెర కర్మాగారంలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయినట్టు కర్మాగారం జనరల్ మేనేజర్ వెంకటసూర్యనారాయణ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. విజయనగరంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి చెరకును కర్మాగారానికి తరలించామన్నారు. చెరకు తరలించిన వారంరోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు వివరించారు.
చిన్నారులకు వ్యాక్సినేషన్
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీలో జ్వరాలు, వంటిపై దద్దుర్లతో గత కొద్ది రోజులుగా చిన్నారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు పంచాయతీ పరిధిలోని చెలకపాడు గ్రామానికి వచ్చి జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులను పరీక్షించి వెళ్లారు. పిల్లలకు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయకపోవడమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించడంతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గిరిజన గూడలకు చేరుకుని పిల్లలకు శుక్రవారం వ్యాక్సిన్లు వేశారు. వాస్తవంగా ప్రతి శనివారం, బుధవారం వ్యాక్సిన్లు వేయాలి. జ్వరాల తాకిడి, దద్దుర్ల వ్యాప్తి అధికం కావడంతో వ్యాక్సినేషన్ డే నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి బొడ్డపాడు, శెనగపాడు, పల్లపుదుంగాడ గ్రామాల్లో వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. డీఐఓ ఆర్.అచ్యుతమణి మరికొన్ని గ్రామాలను సందర్శించారు. జ్వరాల వ్యాప్తిపై ఆరా తీశారు.
సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0
విజయనగరం క్రైమ్: సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఉమ్మడి విజయనగరం జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు. విజయనగరం ప్రదీప్‌నగరలోని ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాలో 26, పార్వతీపురం మన్యం జిల్లాలో 137 గ్రామాలను సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఒక్కో ఎక్సైజ్ అధికారికి రెండు నుంచి మూడు గ్రామాలు దత్తత ఇచ్చి ఆయా గ్రామాల్లో సారా నిర్మూలనకు కృషిచేస్తామని చెప్పారు. దీనికోసం సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, స్థానిక ఎకై ్సజ్ అధికారి, మహిళా సంఘాల సభ్యులతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, ఎఫ్‌ఆర్‌ఓ, జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి, అటవీ అధికారి ఉంటారని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలుచేస్తామని హెచ్చరించారు. గతేడాది అక్టోబర్ నుంచి విజయనగరం, పార్వతీపురం(మన్యం) జిల్లాల్లో 360 కేసులు నమోదుచేసి 210 మందిని అరెస్టు చేశామన్నారు. సారా తయారు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా టోల్ ఫ్రీ నంబర్ 14405కి, విజయనగరం కంట్రోల్ రూమ్‌నంబర్ 08922 274865, పార్వతీపురం కంట్రోల్ రూమ్ నంబర్– 08963222778కి సమాచారం అందజేయాలని కోరారు. ఆయా వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
3.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్
3.25 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్
Comments
Please login to add a commentAdd a comment