ఆయుధ భాండాగారంగా బాడంగి ఎయిర్‌స్ట్రిప్
బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి సమీపంలోని బ్రిటిష్ కాలంనాటి ఎయిర్‌స్ట్రిప్‌ను విశాఖ నావికాదళ శాఖ ఆయుధ భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నట్టు నావికాదళ జూనియర్ మేనేజర్, వర్క్స్‌సెక్షన్ ఆఫీసర్ పి.చైతన్య తెలిపారు. ఆర్డీఓ రామ్మోహన్‌రావుతో కలిసి శుక్రవారం సంబంధిత భూములు పరిశీలించారు. ఆయుధ భాండాగారం ఏర్పాటుకు ప్రస్తుతం నావికాదళానికి చెందిన భూమితో పాటు మరో 1613.63 ఎకరాలు అవసరమన్నారు. ఇక్కడ నావెల్ ట్రైనింగ్ పరికరాలు, యుద్ధసామగ్రిని నిల్వ చేస్తామన్నారు. దీనిని నావెల్ ఫీడ్‌రికై ్వర్ మెంట్ జోన్‌గా పిలుస్తామని చెప్పారు. ఇక్కడికి డొంకినవలస రైల్వేస్టేషన్ దగ్గరగా ఉన్నందున విడిపనిముట్లు సరఫరాకు వీలుంటుందన్నారు. రైల్వేస్టేషన్ వరకు ప్రత్యేక రోడ్డును నిర్మిస్తామని, ఇది స్థానిక ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఎయిర్‌స్ట్రిప్ నుంచి నేరుగా పాల్తేరు హైస్కూల్ వరకు రెవెన్యూశాఖ గుర్తించిన భూములను పరిశీలించారు. హైస్కుల్‌కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ముగడ, మల్లంపేట, పాల్తేరు, పూడివలస, కోడూరు, రామంచద్రాపురం, మల్లంపేట గ్రామాలకు చెందిన 1585 ఎకరాల భూములను గుర్తించామన్నారు. వీటిలో ప్రభుత్వ, డీ పట్టా, మాగాణి, మెట్ట భూములు, ప్రభుత్వేతర భూములు కలిసి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సర్వేయర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నావికాదళ సెక్షన్ ఆిఫీసర్ చైతన్య
ఆర్డీఓతో కలిసి భూముల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment