
లోక్ అదాలత్‌లో..6,677 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లలో 6,677 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీయే రాజమార్గమని తెలిపారు. మోటారు ప్రమాద బీమా క్‌లైమ్‌లకు సంబంధించిన కేసులో రూ.70 లక్షల పరిహారాన్ని అందజేసినట్టు వెల్లడించారు. సుమారు రూ.35 కోట్ల ఆస్తులకు సంబంధించిన (విలువైన) కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 10,500 మంది కక్షిదారులు ప్రయోజనం పొందినట్టు తెలిపారు. లోక్ అదాలత్‌లలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు, జడ్జిలు బి.అప్పలస్వామి, ఎన్.పద్మావతి, కె.నాగమణి, టి.వి.రాజేష్‌కుమార్, బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, ఎల్.దేవీరత్నకుమారి, బి.రమ్య, పి.బుజ్జి, ఎమ్.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ.హరీష్ తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌లో..6,677 కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment